19/09/2025
కారంచేడు అనే ఒక గ్రామంలో మాదిగలకు కమ్మలకు మధ్య జరిగిన ఘటన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉన్న మొత్తం దళితులకు రాష్ట్రంలోని మొత్తం కమ్మవారు మరియు TDP శత్రువులు అని జరిగిన ప్రచారం వలన ఈ 35 సం లు నష్టపోయింది ఎవరు?
ఆ ప్రచారాన్ని నమ్మకుండా మాదిగ సోదరులు తెలివిగా అటు కాంగ్రెస్,ఇటు TDP, ఇప్పుడు YCP, BJP పార్టీలను వర్గ శత్రువులుగా చూడకుండా అన్ని పార్టీల్లోను మంచి అవకాశాలు తెచ్చుకున్నారు.
కానీ మాల/మహర్ల పరిస్థితి ఏంటి?
కారంచేడు ఘటనలో YSR గారి బ్యాచ్ చేసిన ప్రచారాన్ని నమ్మి TDP ని వర్గశత్రువుగా(మూర్కత్వంతో)ఈ 35 సం లు దూరం చేసుకున్నాము..
BJP ని సైద్ధాంతిక శత్రువుగా దూరం పెట్టాం..
కాంగ్రెస్ మరియు వైసీపీలు మన సొంత పార్టీలు అనుకుని వారి తరపున మన వాళ్ళు కత్తులు తిప్పేశారు..
కానీ మాల/మహర్ లకు అన్యాయం జరిగినపుడు కాంగ్రెస్ YCP లు కూడా మనల్ని వదిలేశాయి..
విశ్వాసం అనుకుని మూర్కత్వం తో రాజకీయ ఆనాధలుగా మిగిలిపోయాం..
ఇదంతా కేవలం ఒక గ్రామం లో జరిగిన ఘర్షణని రెండు కులాల శత్రుత్వంగా కొందరు వెధవల ప్రచారాన్ని నమ్మడం వలన దాదాపు నాలుగు దశాబ్దాలు జాతి వెనుకబడిపోయింది..
కారంచేడు గాయం నుండి బయటపడిన మన సాటి మాదిగ సోదరులు ఇప్పుడు అదే TDP లో హోమ్ మినిష్టర్ స్థాయికి ఎదిగారు..
మాలలు/మహర్లు మాత్రం అన్ని పార్టీలకు,అన్ని కులాలకు శత్రువులయ్యారు..
అదే కారంచేడు ప్రచారాన్ని నమ్మి మాల/మహర్లు మాత్రం అవకాశాలు కోల్పోయాం..
(ఊర్లో పెళ్ళికి అనే సామెత మనకి వర్తించేలా ఉందిరా బాబు)
వర్గీకరణ CBN గారే చేశారు అని వాగే వాళ్లకు నా ప్రశ్న:-మనం పనిచేసిన కాంగ్రెస్(రేవంత్ గారు) కూడా చేసిందిగా? దానికేమంటారు?
దీనికి కారణం ఒక చోట కొందరికి మధ్య జరిగిన ఘర్షణని రెండు కులాల ఘర్షణగా ఎవ్వడైనా చెప్తే గుడ్డిగా నమ్మి ఆ కులంలోని మంచివాళ్ళని,దానికి సంబందించిన రాజకీయ పార్టీని కూడా విమర్శించి అందరికీ చెడ్డ అయ్యాం..
ఇప్పుడు కైకలూరు ఘటన కూడా అలాంటిదే అక్కడ రెండు వర్గాల ఘర్షణ.. నిందితులు అందరూ అరెస్ట్ అయ్యారు.. అయినా సరే వాళ్ళ కులాన్ని(KAPU), ఆ కులానికి చెందిన నాయకుడిని (పవన్ గారు) ఆ పార్టీని (జనసేన ని ), ఆ పార్టీ ఉన్న కూటమి TDP ని విమర్శించే స్థాయికి కొందరు మాల నాయకులు దిగజారారు..
ఇలాంటి దౌర్బాగ్యుల వలన ప్రభుత్వానికి, ఇతర కులాలకు మొత్తం మాలలంతా/మహర్లంతా శత్రువులు అవుతున్నారు.. ఆ దౌర్భాగ్యులను ఎలాగూ మార్చలేము కనీసం మాల/మహర్ యువత అయినా పరిస్థితి అర్ధం చేసుకుని రాజకీయంగా బలపడే ప్రయత్నం చేయకపోతే ఈ జాతి మళ్ళీ బానిసత్వం లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు..
కమ్మవ్యక్తి తో గొడవ వస్తే కమ్మకులం మొత్తం శత్రువు అని ప్రచారం జరుగుతుంది..
కాపు వ్యక్తితో గొడవ జరిగితే కాపు కులం మొత్తం శత్రువు అని ప్రచారం జరుగుతుంది..
కానీ చుండూరు లో రెడ్డి కులస్థులు మాలల్ని ఊచకోత కోస్తే రెడ్డికులం మొత్తం శత్రువు అవ్వకుండా జగన్ రెడ్డి మనకు మేనల్లుడు ఎలా అయ్యాడో ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది 😄
మనం రాజకీయంగా బలపడాలి.. తరువాత తరాల్ని అయినా బాగుపర్చాలి అనే మా ప్రయత్నాన్ని అడ్డుకోడానికి మన శత్రువులు సిద్ధంగా ఉన్నారు..
వారిని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి..
_________________________________________
అన్ని కులాలతో మంచిగా ఉండాలి.. మనం వారికి సహకరించాలి.. వారి సహకారం మనం తీసుకోవాలి..
---------------------------------------------------------------------
త్వరలో మాల పల్లెలు, మాల పేటల్లోకి మహర్ సేన రాబోతుంది..
జై భీమ్.. జై భారత్.. జై చంద్రబాబు.. జైజై మహర్ సేన
ఇట్లు,
రాజేష్ మహర్,
C/o అంబేద్కర్ మహర్,
Telugu Desam Party (TDP) రాష్ట్ర అధికార ప్రతినిధి.