BDYF ADONI

BDYF ADONI బహుజన ప్రజాతంత్ర యువజన సమాఖ్య

 #మండల_స్థాయి_అధికారులు_గ్రామాల_వైపు_చూడండిఆదోని మండలం ఇస్వి గ్రామంలో మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థానిక ప్రజా ప్రతిన...
05/12/2022

#మండల_స్థాయి_అధికారులు_గ్రామాల_వైపు_చూడండి

ఆదోని మండలం ఇస్వి గ్రామంలో మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు.
గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ప్రజల మధ్యకు వెళ్లి అక్కడ పేరుకుపోయిన మురికి కాలువల పూడికను తీసి ప్రజలు రోగాల పాడిన పడకుండా చూడాలని కోరుతున్నాము.

సచివాలయాలు తనిఖీ చేస్తున్నట్లు అధికారులు జిమ్మిక్కులు చేయడం మానుకొని గ్రామాల్లో సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకుని వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

బహుజన ప్రజాతంత్ర యువజన సమాఖ్య

 #త్రాగునీటి సమస్య కలగకుండా చూడండి.గుత్తదారులపై చర్యలు తీసుకోండి  ఎంపీడీవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ అభిషేక్ గారి...
08/11/2022

#త్రాగునీటి సమస్య కలగకుండా చూడండి.
గుత్తదారులపై చర్యలు తీసుకోండి

ఎంపీడీవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ అభిషేక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం బీడివైఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు యం.తాహేర్ వలి, రామకృష్ణ మాట్లాడుతూ
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, జాలిమంచి, గణేకల్లు, ఇస్వి ఈ ఆరు గ్రామాలకు త్రాగునీరు ప్రతిరోజు సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుతం గుత్తాదారుల , ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మధ్యకాలంలో మూడు నెలలుగా త్రాగునీటి సమస్య తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైపులైన్ లీకేజీ అయినప్పుడు వెంటనే మరమ్మతులు చేయటంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మోటార్ రిపేర్ వచ్చినప్పుడు దానిని మరమ్మత్తులు చేసేంతవరకు ప్రత్యామ్నాయంగా మరో మోటార్ను నడపాల్సిన అవసరం ఉంది గుత్త దారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఒకే మోటార్ తో ఆరు గ్రామాలకు త్రాగునీరు పంపింగ్ అసాధ్యం అవుతుంది. రెండు మోటార్లు ఉన్నప్పటికీ ఒక మోటార్ చెడిపోయి ఉన్న మరో మోటార్ చెడిపోయేంతవరకు అధికారులు గుత్తదారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. వారిపై చర్యలు తీసుకొని ఆ గ్రామాల ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించండి.

1.సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించండి
2. ఒక భాగం గండిపడి ఉంది దాన్ని వెంటనే మరమ్మత్తులు చేయండి.
3. రెండవ అదనపు పైపులైన్ వేసి వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడండి.
4. నీటిని ప్రతిరోజు శుద్ధి చేసి పరాపరా అయ్యే విధంగా చర్యలు తీసుకోండి.
5.ప్రస్తుతం ఉన్న గుత్తదారులను తొలగించి వారి స్థానంలో బాధ్యతగా వ్యవహరించే వారిని నియమించండి.
ఈ కార్యక్రమంలో అంజనేయ, రామంజి, వీరేష్, లక్ష్మన్న, దస్తగీర్ ఇతరులు పాల్గొన్నారు.

06/11/2022

BDYF ADONI FB page please follow లైక్

Address

Pandavagallu
Adoni
518302

Website

Alerts

Be the first to know and let us send you an email when BDYF ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category