16/07/2026
💥 *- టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికై కృషి చేస్తాం..*
*- టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ నియామకం.*
*- శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు...*
*గద్వాల:* నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ బలోపేతానికై పార్టీ శ్రేణులు అందరిని కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా ముందుకు సాగుతూ సామాజిక న్యాయమే లక్ష్యంగా పోరాడుతామని *గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్* పేర్కొన్నారు.
బుధవారం తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాలలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని *నియోజకవర్గం ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్* కు కేక్ కటింగ్ చేయించి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నడిగడ్డ మార్పు కోసం ప్రజా సమస్యలపై అనేక రకాల ఉద్యమాలు కొనసాగిస్తూ సమస్యల పరిష్కారానికై గొంగళ్ళ రంజిత్ కుమార్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించడం హర్షణీయమని పార్టీ శ్రేణులు తెలిపారు. ఆయన నాయకత్వంలో గద్వాల నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
*ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ....*
తనపై నమ్మకం ఉంచి గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.
గద్వాల నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సామాజిక న్యాయమే లక్ష్యంగా రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, బలహీన వర్గాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ, రానున్న రోజుల్లో గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమవంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ నాయకులు బుచ్చిబాబు,లవన్న, వెంకట్రాములు మండల స్థాయి నాయకులు గోవిందు, మునెప్ప, మల్దకల్, అడివి ఆంజనేయులు, నజుముల్లా,రాము, గోపాల్, భీమన్ గౌడ్, జమ్మన్న, స్వామి,జగదీష్, రేనప్ప, అమరేష్,యండి. సలీమ్, వీరేష్, చిన్న రాముడు, నర్సింహులు, జగదీష్, రోషన్న, రాజు, గుండన్న, భూపతి నాయుడు, సర్వేష్,శివన్న,దయాకర్,అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.