Tanishq Herbal Clinic

Tanishq Herbal Clinic We are an Ayurvedic Herbal clinic located in Palakonda Andhra Pradesh. We provide treatment for all diseases using traditional Ayurvedic medicines.

We also sell all types of Ayurvedic medicines and Organic foods of all types.

https://youtube.com/channel/UClZPMG6Ls1SutAGlzfJii6wWatch this videos and subscribe my channel.
26/11/2021

https://youtube.com/channel/UClZPMG6Ls1SutAGlzfJii6w

Watch this videos and subscribe my channel.

Hi guys!I'm Dr.S S Prakash ! Welcome to my official youtube channel "S S Prakash" i hope you like my channel.Please like,Share & subcribe my channel ...

మీరు క్రింద  చూస్తున్నవి ప్రముఖ కంపెనీ ల ఆయుర్వేద ఔషదాలు. ప్రస్తుత పరిస్థితులలో వీటిని వాడుటవలన మనలో వ్యాధి నిరోధక శక్తి...
22/07/2020

మీరు క్రింద చూస్తున్నవి ప్రముఖ కంపెనీ ల ఆయుర్వేద ఔషదాలు. ప్రస్తుత పరిస్థితులలో వీటిని వాడుటవలన మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి బ్యాక్తీరియా, వైరస్ ల నుండి కాపాడి వ్యాధి రహిత శరీరము తయారగును. ఇందులో 1). హెర్బల్ శానిటైసర్. దీనిని వాడుటవలన స్కిన్ రియాక్షన్స్ రావు. సుగంధభరితముగా ఉండును. 2). చావంప్రెస్సులేహ్యము. ఇది 21మూలికలతో తయారైనది. దీని వలన ధాతు పుష్టి కలిగి ఇమ్మ్యూనిటీ పవర్ పెరుగును. దీనిని 2పుటలు పాలతో వాడవలెను. 3). పంకజకస్తూరి గ్రాన్యూల్స్. దీనిని వాడుటవలన శ్వాస ఇబ్బందులు తొలగిపోవును. దీనిని 2పూటలు పాలు /నీళ్లు తో వాడవలెను. 4). అనుతైలం. దీనిని వాడుటవలన ముక్కులో వుండే సమస్యలు తొలగి సైనస్ ప్రౌబ్ల్యూమ్స్ లేకుండా చేయును. దీనిని రాత్రి పదుకొనె ముందు 2ముక్కు రంద్రాలలో 2చుక్కలు వేయవలెను. ఇమ్మ్యూనిటి పవర్ పెరుగును. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ధన్యవాదములు తో.... మీ డా. సూర్యప్రకాశరావు సందురు. (అనువంశిక ఆయుర్వేద వైద్యులు ). తనిష్క్ హెర్బల్ క్లినిక్. తమ్మినాయుడు కాలేజీ ఎదురుగా. మెయిన్ రోడ్. పాలకొండ. 9705628862. # పై 4 ఔషదములు మా వద్ద అందుబాటులో కలవు. Tq. One & all.

గోధుమనారు *********గోధుమ గడ్డిని 'జీవం కలిగిన ఆహారం గా ' పేర్కొనవచ్చును. ఇది విటమిన్ "ఈ 'తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ముఖ...
22/07/2020

గోధుమనారు
*********
గోధుమ గడ్డిని 'జీవం కలిగిన ఆహారం గా ' పేర్కొనవచ్చును. ఇది విటమిన్ "ఈ 'తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్లోరోఫిల్ ని అందిస్తుంది . రక్త శుద్దికి, శరీర కణాల పునర్జన్మకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. మెరుగుపరుస్తుంది. కాన్సర్ వ్యాధి పెరుగుడలు నివారిస్తుంది. గోధుమ గడ్డి రసం త్రాగడం వలన శరీరములోని విసపురితాలన్ని బయటికు విసర్జింపబడతాయి.

గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌,మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌,సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు. గోధుమ గడ్డి ప్రయోజనాలను దిగు వన ఉదహరిస్తున్నాము.

1. ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణా లు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.

2. అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.

3. తాల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తాల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది.మీరు క్రింద చూస్తున్నది మా హెర్బల్ క్లినిక్ లో తయారు చేసిన గోధునారు దీన్ని 7రోజులు తరువాత కోసి మిక్సీ లో వేసి జ్యూస్ త్రాగవచ్చు. ప్రతి రోజు దీన్ని 30ml చొప్పున పరగడుపున త్రాగుచున్న పై ప్రయోజనములు కలుగును from: డా. S.సూర్యప్రకాశరావు (అనువంశిక ఆయుర్వేదవైద్యులు ). తనిష్క్ హెర్బల్ క్లినిక్* తమ్మినాయుడు కాలేజీ ఎదురుగా * మెయిన్ రోడ్ * పాలకొండ. 9705628862.

ఇది సందురు సూర్యప్రకాశరావు యొక్క రిటైర్మెంట్ సన్మానసభ. తేదీ 30-6-2020న zphs లక్ష్మీపురం లో ఘనం గా జరిగింది. ఉపాధ్యాయులంద...
02/07/2020

ఇది సందురు సూర్యప్రకాశరావు యొక్క రిటైర్మెంట్ సన్మానసభ. తేదీ 30-6-2020న zphs లక్ష్మీపురం లో ఘనం గా జరిగింది. ఉపాధ్యాయులందరికి కృతజ్ఞతాభి వందనములు.

02/07/2020

అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు -

* చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .

* దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

* ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును

* జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును.

* పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును .

* విరేచనం సాఫీగా అయ్యేలా చేయును .

* విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.

* రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి

* వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును .

* శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును .

* శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును .

* వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి.

* థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .

* మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు .

* తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .

* గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .

* స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.

* చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును .

* క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు .

పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావలెను అనిన శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను.

మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగుగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలయందు ఉడికించి బాగుగా ఎండించవలెను. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను .

పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇచ్చును.

అవసరం ఉన్నవారికి మాత్రం చేసి ఇవ్వబడును. మీకు ఈ చూర్ణం కావలెను అనినచో నన్ను సంప్రదించగలరు. నా నెంబర్ 9705628862 కి ఫోన్ చేయగలరు.
సదా మీ సేవలో డా : S.సూర్యప్రకాశ రావు AMBS(అనువంశిక ఆయుర్వేద వైద్యులు ). తనిష్క్ హెర్బల్ క్లినిక్. మెయిన్ రోడ్. పాలకొండ. 9705628862

02/07/2020

మధ్య వయసులో వచ్చే కంటి సమస్య లకు అవేసే ఆకుతో పరిష్కరించుకోవచ్చు

**************
👉 రేచీకటి : అవిసే ఆకుల్లో విటమిన్ - ఎ మరియు విటమిను సి లుకుడా ఉన్నాయి. ఆకురసం 10 మి.లీ. ఉదయం - సాయంత్రం సేవించిన రేచీకటి మరియు మందదృష్టి రోగులకు చాలా ఉపయోగకరం.
👉మూతలం (Diuretic) : అవిసె ఆకుల రసాన్ని50-100ml త్రాగిన మూత్రము సాఫీగా అవుతుంది
👉మూత్రంలో రాళ్ళు మరియు కడుపులో పాములు : దీని ఆకులతో చక్కని కషాయం కాచి 20 మి.లీ రోజుకు రెండుసార్లు త్రాగిన కడుపులో క్రిములు తగ్గిపోతాయి నాలుక పై వచ్చే పుండ్లు కూడా తగ్గిపోతాయి.
👉నోటిలో పుండ్లు- గొంతు నొప్పి : అవిసె ఆకులను నోటిలో ఉంచుకొనిమెల్లమెల్లగా నమిలి మింగిన నోటిలోని పుండ్లు గొంతునొప్పి యొక్క వ్యాధి లక్షణాలు నోటిపుండ్లు - గొంతునొప్పి యొక్క వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి.
👉 మలేరియా - జ్వరము - స్మాల్ పాక్స్ :----
అవిసె చెట్టు బెరడు తీసి కషాయ కాచి సేవించిన మలేరియా, జ్వరము మరియు స్మాల్ పాక్స్ వ్యాధి లక్షణాల తగ్గిపోతాయి.
👉 జిగురు విరేచనాల-అతిసారమ
అవిసె బెరడుతో కషాయం20 మి.లీ కాచి సేవించిన జిగురు విరేచనాలు, అతిసారము తగ్గును. 👉 కీళ్ళనొప్పులు, వాపులు :----
అవిసె పువ్వులు లేదా వేర్లను మెత్తగా నూరి ముద్ద చేసి కీళ్ళ నొప్పి ఉన్న భాగంలో పట్టువేస్తే నొప్పులు తగ్గిపోతాయి.
👉 గవద బిళ్ళలు : ----
దీని ఆకుల రసాన్ని గవద బిళ్ళలు వచ్చిన చోట దూది ఆ (Cotton) తో రాస్తే గవద బిళ్లలు తగ్గిపోతాయి. ఇన్ని ఔషధగుణములున్న అవిసెను పెరటి చెట్టు అని తీసి పారేయకుండ సక్రమంగా ఉపయోగిస్తే ఎంతో ఉపయోగకరం.

వైద్య సలహాల కొరకు సంప్రదించండి. డా : S.సూర్యప్రకాశరావు B.Sc:AMBS.(అనువంశిక ఆయుర్వేద వైద్యులు ).తనిష్క్ హెర్బల్ క్లినిక్. తమ్మినాయుడు కాలేజీ ఎదురుగా. మెయిన్ రోడ్. పాలకొండ. 9705628862
🥦🥦🥦🥦🥦🥦🥦🥦

02/07/2020

బహిష్టు నొప్పి నివారణ కు డా. S.సూర్యప్రకాశరావు ఇచ్చే సలహాలు.


మన శరీరంలో రకరకాల జీవగడియారాలు పనిచేస్తుంటాయి. స్త్రీలలో ఇటువంటి జీవ గడియారం ఒకటి యుక్త వయస్సు వచ్చిన నాటినుండి 40-55 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతుంది. దానినే బహిష్టు అంటాము. క్రమం తప్పకుండ బహిష్టుస్రావం రూపంలో ప్రతి 28 రోజులకు కనిపించే ఈ పరంపరను ఆయుర్వేదం 'రుతుక్రమం' అని పిలిచింది.
అలవోకగాజరాగ్ల్సిన ఈ క్రమం బాధామయంగా మారితే దానిని 'రజః కృచ్చ్రత' అంటారు. స్త్రీలలో అండం ఫలదీకరణం చెందిన తరువాత గర్భాశయంలో పెరగవలసి ఉంటుంది. దీనికోసం ముందునుంచే గర్భాశయం సన్నద్ధంగా ఉండటం అవసరం. ఈ ప్రయత్నంలో భాగంగా గర్భాశయం లోపల ఒక మెత్తటి పొర తయారవుతుంది.
ఒకవేళ గర్భం ఫలవంతమైతే ఈ పొరనుండే పిండానికి కావలసిన మౌలికాంశాలు అందుతాయి. లేనిపక్షంలో ఈ పొర మొత్తం కరిగి, బహిష్టు రూపంలో వెలుపలికి స్రవిస్తుంది. ఒక క్రమపద్ధతిలో ప్రతి 28 రోజులకు ఒకసారి వెలువడుతుండటం వలన ఈ బహిష్టు స్రావాన్ని 'నెలసరి' అనే పేరుతో పిలుస్తుంటారు. జీవ క్రియా ధర్మం కనుక బహిష్టు సమయంలో వచ్చే నొప్పి కొంత మేరకు ఆమోదయోగ్యమే అయినా, అది మిమ్మల్ని పట్టి కుదిపేస్తుంటే మాత్రం భరించాల్సిన అవసరం లేదు. కారణాన్ని కనుగొనడం అవసరం. బహిష్టు స్రావం సజావుగా వెలువడేలా చేయడానికి శరీరం లోపల ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయన పదార్థాలు తయారవుతాయి.
ఇవి గర్భాశయం లోపలి పొరను కరిగించడానికి, గర్భాశయాన్ని సంకోచింపడానికి దోహదపడుతాయి. వీటి పనితీరు సక్రమంగా లేకపోతే బహిష్టు స్రావం బాధామయంగానూ, నొప్పిగానూ తయారవుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నడుము ప్రాంతంలోని కటి ప్రదేశం 'అపాన వాయువు'కు కేంద్రస్థానంగా ఉంటుంది. దీని ప్రభావం చేత బహిష్టు స్రావాలు, మల మూత్రాదులు నిరాటంకంగా వెలువడుతాయి. కొన్ని ప్రత్యేకతమైన కారణాలూ, పరిస్థితులులూ ఈ అపానవాయువును అడ్డుకున్నప్పుడు బహిష్టు స్రావం మందగించి నొప్పి మొదలవుతుంది. మీరు బహిష్టు నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే, ఈ కింది పాయింట్ల దిశగా ఆలోచిస్తే మీ ఆందోళన ఒక కొలిక్కివస్తుంది.
1. శారీరక క్రియ:
ఋతుక్రమం పొడవునా స్త్రీ శరీరంలో హార్మోన్లు హెచ్చు తగ్గులుగా విడుదల అవుతుంటాయి. వీటి ప్రభావం వల్లగాని, ప్రోస్టోగ్లాండిన్స్ అతి చురుకుదనం వల్లగాని అత్యధిక శక్తితో గర్భాశయం కుంచించుకున్నప్పుడు, పొత్తి కడుపు పై భాగంలో నొప్పి అనిపిస్తుంది. ఇతర కాంప్లికేషనన్లేవీ లేని సాధారణ బహిష్టు నొప్పుల్లో ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి:
సూచనలు: బహిష్టు నొప్పికి కలబంద అనే మందు మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. రాతి నెలలోనూ, ఎడారి ప్రాంతాలలోనూ పెరిగే ఈ మొక్కలో అసాధారణ ఔషధ విలువలు దాగి ఉన్నాయి. దీని గుజ్జునుండి స్వరసం తీపి బహిష్టుకు రెండు రోజుల ముందు నుంచి తాగటం ప్రారంభించాలి.
చాలా మంది మహిళలు బహిష్టు రోజులలో, కడుపు ఉబ్బరించినట్లుండటం వలన, భోజనం మానేసి స్వీట్లు, ఉప్పు కలిసిన చిరుతిండ్లు తింటుంటారు. కాని ఇలా తినడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. తాజా కూరగాయలూ, పండ్లూ, కారం మసాలాలు కలపని సాత్వికాహారాలూ ఎక్కువగా తీసుకోవాలి. భోజనం తక్కువ మోతాదులలో ఎక్కువసార్లు తీసుకోండి.
కాఫీ, టీ, కోలా డ్రింకులూ, చాక్లెట్లను మానివేయండి; వీటిలో ఉండే కెఫిన్ మిమ్మల్ని ఉద్వేగ పరచడంతోపాటు బహిష్టు నొప్పులను అధికం చేస్తుంది. వీటిబదులు పల్చని పాలు తాగండి. పాలలో కాల్షియం సహజ రూపంలో లభిస్తుంది. బహిష్టు నొప్పులను నియంత్రించడంలో కాల్షియం గణనీయంగా తోడ్పడుతుంది.
మూత్రాన్ని జారీచేసే ఔషధాలను వాడితే బహిష్టు స్రావం కూడా సాఫీగాజరిగి, బాధ శమిస్తుందని కొంతమంది భ్రమిస్తుంటారు. ఐతే, ఈ తర్కం బహిష్టు నొప్పుల విషయంలో పని చేయదు. అంతేకాకుండా మూత్రంతోపాటు కొన్ని ఖనిజాలు శరీరం నుండి వెళ్లిపోయి నొప్పులు అధికమయ్యే అవకాశం కూడా ఉంది.
బహిష్టు నొప్పులెక్కువగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, తేలికపాటి వ్యాయామాలూ, యోగా, విశ్రాంతి వంటివీ తోడ్పడుతాయి. బహిష్టు నొప్పికి చికిత్సగా ఆయుర్వేదం ప్రారంభానికి రెండు రోజుల ముందు విరేచన కర్మను పేర్కొంది. దీనికోసం త్రిఫలాచూర్ణంను వాడచ్చు. ఆహార పరంగా, మలబద్దకం లేకుండా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
దుంపకూరలు, వంకాయ వేపుళ్లను మానేస్తే మంచిది.
బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, మునగ, కాకర, దోస వంటి కాయగూరలు మంచివి. వెల్లుల్లి మరీ మంచిది. ఒకవేళ దీని వాసన మీకు నచ్చకపోతే వెల్లుల్లిని మజ్జిగతోనో, నిమ్మరసంతోనో తీసుకోవచ్చు.
బహిష్టు నొప్పులలో ఇంగువ సమర్థవంతంగాపనిచేస్తుంది. దీనిని ఒక గ్రాము మోతాదుగా ఆహారంతో కలిపిగాని, నేరుగా నీళ్లతోగాని తీసుకోవాలి.
గృహచికిత్సలు: 1. వస పొడిని (అరచెంచాడు) వేడి నీళ్ళతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. నల్లనువ్వులు (ఒక చెంచా), జీలకర్ర (అరచెంచా), బెల్లంతో సహా నూరి రెండు పూటలా తీసుకోవాలి. 3. మందారపువ్వులను గజ్జిగతో కలిపి ముద్దగా నూరి పూటకు రెండు చెంచాల వంతున రెండు పూటలా తీసుకోవాలి. 4. పత్తి చెట్టు వేరు బెరడును కచ్చాపచ్చగా దంచి కషాయం కాచి ప్రతి గంటకు అరకప్పు చొప్పున నొప్పి తగ్గించే వరకు తీసుకోవాలి.
ఔషధాలు: రజఃప్రవర్తనీవటి, అశోకారిష్టం, కుమార్యాసవం, బలాసూర్యోదయ రసం, నష్టపుష్పాంతక రసం, ఫలసర్పి, సుకుమారఘృతం. 2. గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఆపేయడం: హార్మోన్లకు గర్భనిరోధకమాత్రల రూపంలో తీసుకునేటప్పుడు బహిష్టు స్రావం పైన గట్టి నియంత్రణ ఏర్పడటంతో పాటు నొప్పి కూడా నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే వీటిని తీసుకోవడం ఆపివేస్తారో అప్పుడు మళ్లీ బహిష్టు స్రావం అధికమవడంతోపాటు నొప్పి కూడా మొదలవుతుంది.
ఔషధాలు: రజఃప్రవర్తనీవటి, క్రవ్యాదిరసం, టంకణభస్మం, వంగభస్మం.

4. గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిస్):
ఈ వ్యాధిలో బహిష్టు నొప్పి వుంటుంది. గర్భాశయంలోని లోపలిపొరను పోలిన కణజాలం గర్భసంచిలో కాకుండా వేరే చోట ఉదరకోశంలో వివిధ ప్రదేశాల్లో కనిపిస్తున్నప్పుడు దానిని ఎండోమెట్రియోసిస్ అంటారు. గర్భాశయాంతర్గత పొర మాదిరిగా ఈ కణజాలం కూడా బహిష్టు సమయాల్లో ప్రేరేపితమై రుతురక్తాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఐతే, ఈ రక్తానికి బయటకు వెళ్లే మార్గం ఉండకపోవడంతో లోపలే సంచితమై వాపునూ, తంతుయుత నిర్మాణాలనూ తయారుచేయడమే కాకుండా అంతర్గత అవయవాలను ఒకదానికొకటి అతుక్కునేలా చేస్తుంది. సంతానయోగ్య వయసు వచ్చిన మహిళల్లో సుమారు పదిశాతం మందిని ఈ వ్యాధి బాధిస్తుందని ఒక అంచనా. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు స్త్రీలల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. బహిష్టులు మొదలుకాని ఆడపిల్లల్లోనూ, రజోనివృత్తి జరిగిన మహిళల్లోనూ ఈ వ్యాధి కనిపించదు. ఈ వ్యాధికి ఇతిమిద్ధమైన కారణం తెలియక పోయినా, తిర్యక్ దిశలో బహిష్టు రక్తం ప్రవహించి ఉదర కుహరంలోనికి చేరుకొని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ ని ఏర్పరిచి తద్వారా నెల నెలా సమస్యను కలిగించే అవకాశం ఉన్నదని అధ్యయన కారులు సిద్ధాంతీకరిస్తున్నారు. అనువంశిక, వ్యాధిరక్షణ శక్తి తగ్గటం, వ్యక్తిగత శరీర ప్రకృతి వంటివన్నీ ఈ వ్యాధిని కలిగించే అవకాశం ఉంది.
ఎండోమెట్రియోసిస్ వల్ల విపరీతమైన బహిష్టు నొప్పి వస్తుంది. కొంతమందిలో నడుము నొప్పి, మలమూత్ర విసర్జన సమయాల్లో నొప్పి సైతం ఉంటాయి. భార్యాభర్తల సంగమ సమయంలో నొప్పిగా అనిపిస్తుంది. బహిష్టు స్రావం అనియతంగా, అధిక మొత్తాల్లో, అపక్రమంగా జరుగుతుంది.
ఈ కింది సూచనలు పాటిస్తే ఎండోమెట్రియోసిస్ వల్ల ఇబ్బంది కలుగకుండా ఉంటుంది.
సూచనలు: పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కండరాలు ముడుచుకోవడం వల్ల ఏర్పడే 'శూల' (క్రాంపింగ్) తగ్గుతుంది. అలాగే గింజ ధాన్యాలు, ఇతర నూనె గింజలను తీసుకుంటే, వాటిల్లో ఉండే తైలాల వల్ల నొప్పి ఉపశమిస్తుంది.
పెరుగు, మజ్జిగ, వెల్లుల్లి, ఇంగువ, కాయగూరలు, క్యారెట్స్ వంటివి మంచివి. పంచదార, జంతుసంబంధ కొవ్వు పదార్థాలు నొప్పిని ఎక్కువ చేస్తాయి కాబట్టి వీటిని తగ్గించుకోవాలి. పాలు, మాంసాల్లో హార్మోన్లు ఉండే అవకాశం ఉంది కనుక వీటిని కూడా తగ్గించుకోవాలి.
బీ- కాంప్లెక్స్ విటమిన్ లు కలిగిన ఆహారాలను తీసుకుంటే శరీరంలో సంచితమైన అధిక ఈస్ట్రోజన్ విచ్చినమవుతుంది.
ఉసిరి వంటి విటమిన్ - సి కలిగిన ఆహారాలను తీసుకుంటే రక్తస్రావం ఆగుతుంది. విటమిన్ - ఇ వాపును తగ్గిస్తే, లోహం కలిగిన ఆహారాలు (ద్రాక్ష, యాపిల్) రక్తాన్ని వృద్ధి పరిచి రక్తస్రావం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తాయి. క్యాల్షియం కలిగిన ఆహారాలు (పాలకూర, టమాట, మజ్జిగ( గర్భాశయం కండరాల్లో పుట్టే నొప్పిని తగ్గిస్తాయి.
యుక్తవయసునుంచే ఏరోబిక్ వ్యాయామాలను చేసే ఆడపిల్లల్లో ఎండోమెట్రియోసిస్ తక్కువగా కనిపించినట్లు ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా జల క్రీడలు, ఈత, మెడిటేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాల వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. సోయా చిక్కుడు, ఇతర చిక్కుడ్లు, టమాట, పుచ్చకాయ, రేగు, కంది, పెసర, యష్టి మధుకం, దానిమ్మ వీటిల్లో ఎక్కువగా ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్స్ తగ్గినప్పుడు సానుకూలంగాను, ఈస్ట్రోజన్స్ పెరిగినప్పుడు ప్రతికూలంగాను పనిచేసే సహజమైన స్టీరాయిడ్ ఎంజైమ్ మాడ్యులేటర్స్ ను ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు.
ఔషధాలు: అశోకారిష్టం, పుష్యానుగ చూర్ణం, చంద్రకళారసం.

5. గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్):
కొంతమందికి గర్భాశయపు కండర పొరలలో అక్కడక్కడా కంతులు తయారవుతుంటాయి.ఇవి గర్భాశయం లోపలికీ, లేదా బయటకూ పెరుగుతుంటాయి. ఒక మోస్తారు పరిమాణాన్ని సంతరించుకునే వరకు ఇవి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఇవి గర్భాశయం లోపలికి పెరుగుతుంటే మాత్రం బహిష్టు స్రావాన్ని అడ్డుకుని నొప్పిని కలిగిస్తాయి. గట్టి 'నార' లాంటి పదార్థంతో తయాతవుతాయి కనుక వీటిని వైద్య పరిభాషలో 'ఫైబ్రాయిడ్స్' అంటారు.
గర్భధారణ వయసు వచ్చిన మహిళలు 25 శాతం మందిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బహిష్టులు మొదలుకాని ఆడపిల్లల్లో ఇవి అసలు కనిపించవు. అలాగే, బహిష్టులు ఆగిపోయినవారిలో కూడా కుంచించుకుపోయి కనపడకుండా పోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ కూ ఫైబ్రాయిడ్స్ కూ సంబంధం వుంది; గర్భధారణ వంటి ఈస్ట్రోజన్ పెరిగే సందర్భాలన్నిటిలోనూ ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి.
బహిష్టు స్రావం అత్యధిక మొత్తాల్లో కావడం ఫైబ్రాయిడ్స్ ప్రధాన లక్షణం. ఈ సమస్య ఉన్న వారికి కటివలయం మొత్తం అసౌకర్యంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ చుట్టుపక్కల నిర్మాణాల మీద ఒత్తిడిని ప్రదర్శించడం వల్ల మలబద్దకమే కాకుండా మూత్రవిసర్జన తరచుగా చేయాల్సి వస్తుంది. నరాల మీద ఒత్తిడి పడటం వల్ల తొడల్లోనూ, నడుములోనూ నొప్పిగా అనిపించవచ్చు. కంతులు బాగా పెరిగి గర్భంలో పెరుగుతున్న శిశువు మీద ఒత్తిడిని కలిగించి అబార్షన్ కి దారితీయవచ్చు. ఆయుర్వేదంలో ఫైబ్రాయిడ్స్ కు సంబంధించిన అంశాలు అర్తవాతివృద్ధి (హైపర్ ఈస్ట్రోజినీమియా), మాంసార్భుదం (ఫైబ్రోమైయోమా)అనే వ్యాధుల వివరణల్లో లభిస్తాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికీ సూచనలు ఉపకరిస్తాయి:
సూచనలు: ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, గింజధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. సోయాతో తయారైన ఆహారపదార్థాలనూ, దానిమ్మనూ ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఐసోఫ్లావన్స్ ఉంటాయి. ఇది అధిక ఈస్ట్రోజన్ని తగ్గిస్తాయి. జంతు మాంసాన్ని, కొవ్వునూ, పంచదారను, కెఫిన్ కలిగిన పదార్థాలనూ తగ్గించాలి.
రసాయన ఎరువులతోనూ, క్రిమిసంహారక మందులతోనూ పెరిగిన కూరగాయలను తినకూడదు. విటమిన్ - ఇ, విటమిన్ - సి లను నేరుగానో, ఆహారం రూపంలోనో తీసుకుంటే హార్మోన్స్ విడుదల సక్రమంగా జరిగి ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోతాయి.
ఈవెనింగ్ ప్రైమ్ రోస్ ఆయిల్ ను ఈ సందర్భంగా ప్రత్యేకించి పేర్కొనాలి. ఇది బయట మార్కెట్ లో ప్రైమోసా వంటి పేర్లతో క్యాప్సుల్స్ రూపంలో లభిస్తోంది. దీనిని వైద్య సలహా మేరకు వాడుకోవచ్చు.
ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, లోధ్రాసవం, ప్రదరరిపు రసం, నిత్యానంద రసం.
6. గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్):
గర్భాశయంలో పాలిప్ లు పెరిగినప్పుడు సాధారణంగా బహిష్టు నొప్పి వస్తుంది. దీనికి 'అర్భుదహర' చికిత్సలు అవసరమవుతాయి. ఔషధాలు: నిత్యానంద రసం, సప్తవింశతిగుగ్గులు, కాంకాయనవటి (గుల్మ), పీయూషవల్లీ రసం.
7. గర్భాశయ ద్వారం ఇరుకుగా మారటం:
గర్భాశయపు ద్వారం (సెర్విక్స్) ఇన్ఫెక్షన్ చేత 'ఇరుకుగా; మారినప్పుడు లోపలి బహిష్టు స్రావం లోపలే సంచితమై అసౌకర్యాన్నీ, నొప్పినీ కలిగిస్తుంది.
ఔషధాలు: గంధక రసాయనం, త్రిఫలా గుగ్గులు, పునర్నవాది గుగ్గులు.
8. కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ పఫ్లమేటరీ డిసీజ్):
గర్భాశయం, దాని ముఖద్వారం, ట్యూబులూ వీటిలో దేనికి ఇన్ఫెక్షన్ సోకినా, లోపల వాపు, నొప్పి, అసౌకర్యం మొదలైన లక్షణాలు మొదలవుతాయి. దీనిని 'పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్; అంటారు. ఈ వ్యాధిలో నెలసరిలో హెచ్చుతగ్గులతోపాటు బహిష్టు నొప్పి కూడా చోటు చేసుకుంటుంది.

గృహచికిత్సలు: 1. వస చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి. 4. త్రిఫలా చూర్ణం (ఒకచెంచా), గుడూచి సత్వం (అరచెంచా) రెండూ కలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చొప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి. 5. ఉలవల కషాయం (అరకప్పు) రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. చింతగింజ పిక్కలను పొడిచేసి అరచెందాడు మోతాదుగా పాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 8. నేల ఉసిరిక వేరును బియ్యం కడుగు నీళ్ళతో సహా ముద్దుగా నూరి అరచెంచాడు మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
ఔషధాలు: ఆరోగ్య వర్ధినీవటి, కైశోరగుగ్గులు, రసమాణిక్యం, పుష్యానుగ చూర్ణం, కర్పూర శిలాజిత్తు, చంద్రప్రభావటి, అశోకారిష్టం, లోద్రాసవం, పత్రంగాసవం.
బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరీచ్యాదితైలం, మహానారాయణతైలం. సదా మీ సేవలో డా. S.సూర్య ప్రకాశరావు (అనువంశిక ఆయుర్వేద వైద్యులు ).తనిష్క్ హెర్బల్ క్లినిక్ #మెయిన్ రోడ్ #పాలకొండ. 9705628862.

మీరు క్రింద చూస్తున్నది " బైద్యనాద్ " వారి చవాన్ ప్రెస్. దీని తయారీలో 21మూలికలు వాడారు. చవాన్ ప్రెస్ వాడుతువలన ఉపయోగములు...
19/06/2020

మీరు క్రింద చూస్తున్నది " బైద్యనాద్ " వారి చవాన్ ప్రెస్. దీని తయారీలో 21మూలికలు వాడారు. చవాన్ ప్రెస్ వాడుతువలన ఉపయోగములు : # శరీరము యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగును. తద్వారా bacteria గాని వైరస్ గాని దరిచేరదు. #రోజంతా నీరసము రానీయదు. ఏపని చేయాలన్న ఉత్సాహం కలుగును. #మనలో vaitality (సంభోగశక్తి )పెరుగును. #దీనిని పిల్ల ల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు వాడ వచ్చును. # మధుమేహ వ్యాధి వలన వచ్చే అన్ని సమస్య లను నివారించును. కావలసినవారు సంప్రదించగలరు. సదా మీ సేవలో........ డా. సూర్యప్రకాశరావు సందురు. (అనువంశిక ఆయుర్వేద వైద్యులు ). తనిష్క్ హెర్బల్ క్లినిక్. పాలకొండ. 9705628862

14/06/2020
14/06/2020

అధిక బరువు/కొలెస్ట్రాల్/పొట్ట తగ్గడానికి/ప్యాటి లివర్ సమస్య/ఒబెసిటి తగ్గడానికి
తనిష్క్ హెర్బల్ క్లినిక్ #పాలకొండ #సూచనలు, సలహాలు.
బరువు శరీxర ఆరోగ్యాన్ని చెబుతుంది.మనం తీసుకోనే ఆహారం మలినం వల్ల శరీరంలో క్రొవ్వు పేరుకొపోయి ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది.ప్రతీ నెల మీ ఎత్తుకు తగిన బరువు వున్నారో లేదో చూసుకొండి.బరువు పెరిగినప్పుడు అశ్రద్ద చేయవద్దు.ప్యాటి లీవర్ సమస్య,ట్రైగ్లిజరైడ్స్,ఒబెసిటి,ఇతర సమస్యలు కనిపిస్తున్నాయి.సైడ్ ఎపెక్ట్ లేని ఆయుర్వేద మందులు వాడుకొండి.ఆహార అలవాట్లు మార్చుకోవాలి,వ్యాయమం కు ప్రాదాన్యం ఇవ్వాలి.

వాడవలసిన నూనేలు: నాటు ఆవు నెయ్యి, కొబ్బరినూనే
రోజు త్రాగవలసిన నీరు: నాలుగు లీటర్లు(అర లీటర్ నీటిలో సగం నిమ్మ కాయ కలిపి రోజుకు 4సార్లు త్రాగాలి.. ఉప్పు వాడరాదు)
డ్రై ప్రూట్స్: బాదాం, వాల్ నట్స్,అవిశ గింజలు,గుమ్మడిగింజలు,
ప్లాక్స్: బార్లి, రాగి,
టీ: గ్రీన్ టీ,బ్లాక్ టీ
తినకూడనవి: బంగాళదుంప
తినవలసినవి:క్యాబేజి,ఆనప,బీర,కాకర,దోస,
కార్బోహైడ్రేట్స్ తక్కువగా తినాలి.

ప్రతీ సంవత్సరం “లిపిడ్ ప్రోపైల్” టెస్ట్ చేసుకొండి. ట్రైగ్లిజరైడ్స్ 160 లోపు ఉండేటట్లు చూడండి.
బరువు,క్రొవ్వు కరిగించే టానిక్: “ఒబేనిల్”(దీనిని 2 కప్పులు నీటిలో కలిపి రెండు పూటలు పరగడుపున త్రాగాలి)
బరువు,క్రొవ్వు కరిగించే చూర్ణం: “వెయిట్ లాస్ పౌడర్”( దీనిని 2 చెంచాల చూర్ణం గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం బ్రెస్ చేసిన తరువాత త్రాగాలి),”గార్షినియా పొడి”(రెండు చెంచాల చూర్ణం గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం త్రాగాలి)
బరువు,క్రొవ్వు కరిగించే మాత్రలు: ”సన్ స్లిమ్”, ఒబెనిల్ (రోజుకు రెండు పూటలు భోజనం తరువాత నీటితో వెయ్యాలి)
క్రొవ్వు కరిగించే డ్రింక్: “ఒబేనిల్”(చల్లని నీటిలో 10 ml కలిపి నచ్చినప్పుడు త్రాగాలి)

సదా మీసేవలో......... డా. S.సూర్యప్రకాశరావు (అనువంశిక ఆయుర్వేద వైద్యులు ).తనిష్క్ హెర్బల్ క్లినిక్. పాలకొండ. 9705628862.
……………………………………………………………………………………………………………………….

Address

Tanishq Herbal Clinic
Palakonda
532440

Telephone

+919705628862

Website

Alerts

Be the first to know and let us send you an email when Tanishq Herbal Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tanishq Herbal Clinic:

Share