27/03/2024
జనసేన తీర్థం పుచ్చుకున్న విశాఖ జిల్లా బీసీ నేత మన్యాల శ్రీనివాస్...
ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ మన్యాల శ్రీనివాస్ గారు విశాఖ నగర జనసేన అధ్యక్షులు, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా వేసుకుని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....
ముందుగా 29వ వార్డ్ అంగటిదిబ్బ ప్రాంతం నుండి అట్టహాసంగా ప్రారంభమై జిల్లా తెదేపా కార్యాలయం వరకు అడుగడుగున మన్యాల శ్రీనివాస్ గారికి 29వ వార్డ్ అంతా ప్రజలు బ్రహ్మరథం పట్టి హారతులు పట్టి మన్యాల శ్రీనివాస్ గారి నిర్ణయం సరైనది అని రాబోయే కాలం లో నూతన నాయకత్వం చాలా అవసరం అని ప్రజలందరూ అభివాదాలు చేశారు....
ప్రజలందరి సమక్షంలో పెద్ద ఎత్తున 29వ వార్డ్ నుండి తెదేపా జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి విశాఖ నగర జనసేన అధ్యక్షులు,తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జనసేన కండువా వేసి మన్యాల శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలికారు...
ఈ సందర్భంగా వంశీకృష్ణ గారు మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం లో వైకాపా పార్టీ కి ఎనలేని సేవలు అందించిన మన్యాల శ్రీనివాస్ ఆ పార్టీ ఎన్నో ఇబ్బందులకు పెట్టిన విషయం అందరికి తెలిసిందే... అధికార పార్టీ నీ విడిచిపెట్టి జనసేన పార్టీ లో చేరిన మన్యాల శ్రీనివాస్ కి కచ్చితంగా తగిన గుర్తింపు వుంటుంది అని అంతేకాకుండా మన్యాల శ్రీనివాస్ తో పాటు ఈరోజు జనసేన లో చేరినటువంటి తన అనుచర వర్గానికి అంతటికీ మంచి జరుగుతుంది అని రాబోయే రోజుల్లో కచ్చితంగా కూటమి అధికారం దిశగా అడుగులు ముందుకు సాగుతుంది అని ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని అన్నారు
మన్యాల శ్రీనివాస్ గారి మాట్లాడుతూ గత 25సంవత్సరాలుగా కాంగ్రెస్ మరియు వైకాపా పార్టీ లకు ఎంతగానో సేవలు అందించాను అని అయినప్పటికీ ఈ పార్టీ తనని ఎంతగానో భాదించి ఎంతో అవేదన కి గురి చేసింది అని... దక్షిణ నియోజకవర్గం రూపురేఖలు మారాలన్న,యువతకు ఉద్యోగాలు రావాలన్న, రాష్ట్రం అభివృద్ది చెందాలన్న చంద్రబాబు నాయుడు గారు,పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి,వంశీ కృష్ణ గారి నాయకత్వం దక్షిణానికి చాలా అవసరం అని కుట్రలు చేస్తూ..,కపట ప్రేమ ఒలకబోస్తూన్న వాసుపల్లి గణేష్ కుమార్ కి కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్తాం అని, భారీ మెజార్టీ తో దక్షిణ నియోజకవర్గం లో వంశీ కృష్ణ గారిని గెలిపించి చట్ట సభలకు పంపించి తీరుతామని హితవు పలికారు....