Ram janasena Vzm

Ram janasena Vzm vizianagaram

24/06/2024

గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒక్కటే అని రాసి ఉంటుంది ... ఇంకొంచెం ముందుకి వెళితే అక్కడ " శీఘ్రదర్శనం , ప్రత్యేకదర్శనం , సర్వదర్శనం " అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధరలు పెట్టి ఉంటారు ... మనుషులంతా ఒక్కటే అయినప్పుడు వ్యత్యాసాలు ఎందుకు ? ఉన్నవాడు..లేనివాడు ... పేదవాడు అని మీరే నిర్ణయిస్తునప్పుడు ఆ నీతికథలు ఎందుకు ? సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో, సమాజంలో ఎందుకు దోరుకుతుంది...

పది పైసల అగరొత్తులు, పావలా కర్పూరం వెలిగించి పదే పదే నీ కష్టాలు తీర్చమని
పడీ పడీ దేవుడిని మొక్కుతావు..
ఆ దేవుడు నీకు జన్మనిచ్చింది నీ కష్టాలు తీర్చడానికి కాదు నువ్వు మరొకరి కష్టాలు తీరుస్తావని ఒకరికి చేతనైన సాయం నువ్వు చేస్తే ఆ దేవుడు నీకు చేయాల్సింది చేస్తాడు.🌺

23/06/2024

ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు
ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు తనకాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.

కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు

అమ్మకి కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ దాంట్లోనే
ఉంటాయని వాడి నమ్మకం.

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది . కరుస్తూ ఉన్నట్టు ఉంది . బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
వాడి మడమ నొప్పెడుతోంది .

అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు....బూటు అడుగున చిన్న కన్నం..కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!!

బస్ స్టాండ్ విచారణ కౌంటర్లో వాకబు చేస్తే తెలిసింది...ఇంకో గంట దాకా బస్ ఏదీ లేదని

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …నాన్న పర్సు లో ఏం ఉందో చూద్దామని పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు ,

కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు,

ఆఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో

పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..

ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…
వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .
సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
నాన్న లేడు. స్కూటరూ లేదు .
అతడికి తెలిసిపోయింది.....

నాన్న తన స్కూటర్ తీసుకొని
ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…
ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.
పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు .

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.

ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
ఉండాలి అని చెబుతున్నాడు..
వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది.
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు.
అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."
అంటూ ఏడవసాగాడు !

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!

మీకోసం
తన జీతాన్నే కాదు...
జీవితాన్నీ దారపోసి....
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన
త్యాగాన్ని గుర్తించండి !
బంధాన్ని గౌరవించండి !!
మనసారా ప్రేమించండి !!!

మన పిల్లలకు మన ఆస్తులు కాదు...విలువలతో కూడిన ధర్మాలు ఇవ్వండి....మన సంస్కృతీ
సాంప్రదాయాల గొప్పదనం చెప్పండి.

🌿🌼🙏🙏తండ్రి ప్రేమని అర్థంచేసుకున్న ప్రతి ఒక్క కొడుకుకి అంకితం🙏🌼🌿

ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారాడు..
20/06/2024

ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారాడు..

20/06/2024
15/06/2024

అన్న : బాబ్బాయి అర్జెంటుగా ఒక సిమ్ ఇవ్వవా

షాప్ ఓనర్ : ఇదిగోండి

అన్న : పదకొండు నంబర్లు ఉన్న సిమ్ లేదా...

11/06/2024

ఈ రోజు డేట్ పదకొండు
మా జగన్ అన్నకు వచ్చినా సీట్లు 11

10/06/2024

పవన్ కళ్యాణ్ గారిని ఎవడు ఏమన్నా ఎవడు ఏమనుకున్నా ఆయన వ్యక్తిత్వానికి బానిసలు చాలామంది ఉన్నారు.🙏🙏

Congratulations 🎉🎉👏👏
04/06/2024

Congratulations 🎉🎉👏👏

04/06/2024
30/05/2024

నలుగురు మోసుకెళ్ళే వరకు నాకు నేను బరువు అవ్వకుండా దీవించు శివయ్య..✍🏽🙏🏾

20/05/2024

నువ్వు మనస్ఫూర్తిగా
"" నవ్వాలంటే""
ముందు నీ బాధ తో
నువ్వు ఆడుకోగలగాలి...

Correct చెయ్యండి..

14/05/2024

*2024 లో పోలైన ఎన్నికల వివరాలు*
విజయనగరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య : 257205
మగవారు వేసిన ఓట్లు: 89899
ఆడవారు వేసిన ఓట్లు: 94874
ఇతరులు వేసిన ఓట్లు: 7
----------------------------------------
మొత్తం పోలైన ఓట్లు: 184780
----------------------------------------
నియోజకవర్గంలో పోలైన శాతం: 71.84

*అత్యల్పంగా పోలైన ప్రాంతం*
Polling station No: 232
ప్రాంతం: VUDA COLONY, SALIPETA ROAD
మొత్తం ఓట్లు: 674
పొలైన ఓట్లు: 326
పాలైన శాతం: 48.36795252

*అత్యధికంగా పోలైన ప్రాంతం*
Polling station: 4
ప్రాంతం: Kondakarakam
మొత్తం ఓట్లు: 1128
పోలైన ఓట్లు:1077
పోలైన ఓట్లు శాతం: 95.4787234

, "ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు".

Address

Vizianagram
535001

Telephone

+91 90006 99904

Website

Alerts

Be the first to know and let us send you an email when Ram janasena Vzm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category